Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేజ్రీవాల్ అరెస్ట్‌పై వివరణ కోరుతూ సీబీఐకి హైకోర్టు ఆదేశం

Delhi HC notices to CBI in Kejriwal arrest
Advertisement
  • తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్ 
  • కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
  • వారంలోగా వివరణ ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు
Advertisement
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం లోగా కేజ్రీవాల్ అరెస్ట్‌పై వివరణ ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Advertisement
Advertisement
Arvind Kejriwal
Delhi Liquor Scam
AAP

More Telugu News